అజర్‌బైజాన్‌లో ఆకట్టుకుంటున్న రషీద్ అల్ ఖలీఫా 'ఫస్ట్ లైట్'
- March 24, 2023
బహ్రైన్: అజర్‌బైజాన్‌లోని బాకులోని హేదర్ అలియేవ్ కల్చరల్ సెంటర్ లో ప్రఖ్యాత బహ్రెయిన్ కళాకారుడు రషీద్ అల్ ఖలీఫా చేసిన చిత్రాల ప్రదర్శన 'ఫస్ట్ లైట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళా ప్రేమికులను ఆకట్టుకుంటుంది.రషీద్ అల్ ఖలీఫా ఎంపికలను ప్రదర్శించే ఈ ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుంది. హేదర్ అలీయేవ్ సెంటర్ డైరెక్టర్, అజర్‌బైజాన్ అసిస్టెంట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనర్ అలక్‌బరోవ్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ.. దివంగత వాస్తుశిల్పి జహా హదీద్ రూపొందించిన - హేదర్ అలీయేవ్ కల్చరల్ సెంటర్‌లో తన పెయింటింగులను అద్భుతంగా ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు.తాను తరచుగా వారసత్వం, సంస్కృతి, పరిసరాలకు సంబంధించిన అంశాలను ఎంచుకొని సమకాలీన చిత్రాలను రూపొందిస్తానని తెలిపారు. భవిష్యత్తులో అజర్‌బైజాన్ కళాకారులచే ఆర్ట్ ఎగ్జిబిషన్‌లను నిర్వహించాలని తన ఆకాంక్షను షేక్ రషీద్ అల్ ఖలీఫా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







