అజర్బైజాన్లో ఆకట్టుకుంటున్న రషీద్ అల్ ఖలీఫా 'ఫస్ట్ లైట్'
- March 24, 2023బహ్రైన్: అజర్బైజాన్లోని బాకులోని హేదర్ అలియేవ్ కల్చరల్ సెంటర్ లో ప్రఖ్యాత బహ్రెయిన్ కళాకారుడు రషీద్ అల్ ఖలీఫా చేసిన చిత్రాల ప్రదర్శన 'ఫస్ట్ లైట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళా ప్రేమికులను ఆకట్టుకుంటుంది.రషీద్ అల్ ఖలీఫా ఎంపికలను ప్రదర్శించే ఈ ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుంది. హేదర్ అలీయేవ్ సెంటర్ డైరెక్టర్, అజర్బైజాన్ అసిస్టెంట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనర్ అలక్బరోవ్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ.. దివంగత వాస్తుశిల్పి జహా హదీద్ రూపొందించిన - హేదర్ అలీయేవ్ కల్చరల్ సెంటర్లో తన పెయింటింగులను అద్భుతంగా ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు.తాను తరచుగా వారసత్వం, సంస్కృతి, పరిసరాలకు సంబంధించిన అంశాలను ఎంచుకొని సమకాలీన చిత్రాలను రూపొందిస్తానని తెలిపారు. భవిష్యత్తులో అజర్బైజాన్ కళాకారులచే ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహించాలని తన ఆకాంక్షను షేక్ రషీద్ అల్ ఖలీఫా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!