ప్రవాసులు షాపింగ్ చేయకుండా నిరోధించడం చట్టవిరుద్ధం
- March 24, 2023
కువైట్: రమదాన్ పవిత్ర మాసంలో షాపింగ్, ఉత్పత్తుల కొనుగోలు కోసం ప్రవాసుల ప్రవేశాన్ని అనేక సహకార సంఘాలు నిరోధిస్తునట్లు సమచారం. దీని కారణంగా కో-ఆప్లలో పెద్ద సంఖ్యలో ప్రవాస దుకాణదారులు తగ్గింపు ధరలకు విక్రయించే రమదాన్ ఉత్పత్తులను కొనుగోలు చెయ్యలేకపోతున్నారని తెలుస్తుంది.అయితే ఈ చర్య చట్టవిరుద్ధమని వినియోగదారుల రక్షణ సంఘం పేర్కొంది. "ప్రవాసులు ఏదైనా సహకార సంఘంలోకి ప్రవేశించకుండా నిరోధించడం మరియు పౌరులకు మాత్రమే ఉత్పత్తులను పరిమితం చేయడం చట్టవిరుద్ధం" అని వినియోగదారుల రక్షణ సంఘం అధిపతి మెషాల్ అల్-మనే అన్నారు. “పౌరులు లేదా ప్రవాసులు అయినా వినియోగదారులకు వస్తువులను విక్రయించడానికి సహకార సంస్థ తిరస్కరణకు అవకాశం లేదు. వినియోగదారుల రక్షణ చట్టం అటువంటి నిర్ణయాల నుండి రక్షిస్తుంది. సహకార సంఘాలు వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి వాణిజ్య లైసెన్స్ కలిగి ఉన్న సంస్థలు, ఇతర సారూప్య సంస్థలకు వర్తించే మార్కెట్ చట్టం వాటికి కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, నేషనల్ గార్డ్ సొసైటీకి చెందిన అధికార యత్రాంగం కువైట్ కాని వినియోగదారులకు అమ్మకాలను నిరోధించడం గురించి సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలను ఖండించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







