కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కీలక నిర్ణయాలు..

- March 25, 2023 , by Maagulf
కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కీలక నిర్ణయాలు..

న్యూ ఢిల్లీ: భారత కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది.నిన్న (శుక్రవారం) జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు ఇచ్చే డీఏను 38 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. దీంతో 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. 69.76 లక్షల మంది పింఛన్​దారులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం నిర్ణయంతో కేంద్ర ఖాజానాపై సంవత్సరానికి రూ.12,815 కోట్ల భారం పడనుంది.

2023 జనవరి 1 నుంచే పెరిగిన డీఏ అమలు కానుంది.పెరుగుతున్న ధరల నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులకు ఊరటగా కేంద్రం డీఏను ఇస్తోంది.వినియోగ ధరల పట్టీ ఆధారంగా కేంద్రం డీఏను లెక్కిస్తుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా.. డీఏను పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఏమేర డీఏ పెంచే అవకాశం ఉంది. ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద అందించే LPG సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీని రూ.200కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎక్కవగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 9.6 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేరుకుతుందని కేంద్రం వెల్లడించింది. లబ్ధిదారులు 14.2 కిలోల సిలిండర్​ను.. సంవత్సరానికి 12 సార్లు.. సబ్సిడితో రీఫిల్​ చేసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ తెలిపారు. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com