రమదాన్ స్పెషల్: సాంప్రదాయ ఒమానీ వంటకాలు
- March 25, 2023
మస్కట్: రమదాన్ సమయంలో సుహూర్ (ఉపవాసం ప్రారంభం), ఇఫ్తార్ (ఉపవాస విరమణ) అరబ్ దేశాలలో ప్రత్యేక వంటకాలు కొన్ని ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ఖర్జూరంలో ఉపవాసం సమయంలో రోజంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి అవసరమైన అన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయని ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఫిర్దౌస్ నూరైన్ తెలిపారు. ఒమన్ తన ఆహార వారసత్వంలో చాలా భాగాన్ని నిలుపుకుందని, ప్రత్యేకంగా రమదాన్ సమయంలో ఒమానీ సంప్రదాయ వంటకాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఒమానీ రుచికరమైన వంటకాలలో మూలికలు, మెరినేడ్‌ల రకాలతో సుగంధ ద్రవ్యాల మిశ్రమ కలయికతో తయారు చేస్తారని తెలిపారు. 1960లలో ఒమన్‌లో ప్రత్యేకంగా రంజాన్ సమయంలో ఆహారాన్ని వండే సాంప్రదాయ పద్ధతులు పురుడుపోసుకున్నాయని పేర్కొన్నారు. 1960వ దశకంలో ఒమన్‌లోని పాత రోజులలో అత్యంత ఇష్టపడే ఆహారం చికెన్ లేదా లాంబ్ రైస్. తాజా కుంకుమపువ్వుతో వాటిని వండుతారు. జాతార్, అల్లం, జాజికాయ వంటి పదార్ధాలను రుచికోసం వినియోగిస్తారు. చేపలను తాజాగా తరిగిన ఉల్లిపాయలు, ముల్లంగి, బచ్చలికూర కలిపి చేసే రెసిపీ కూడా ఒమానీ చరిత్రకు అద్దం పడుతుందన్నారు. దీనిని ఎక్కువగా ఇఫ్తార్ సమయంలో తయారు చేస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







