రమదాన్ స్పెషల్: సాంప్రదాయ ఒమానీ వంటకాలు

- March 25, 2023 , by Maagulf
రమదాన్ స్పెషల్: సాంప్రదాయ ఒమానీ వంటకాలు

మస్కట్: రమదాన్ సమయంలో సుహూర్ (ఉపవాసం ప్రారంభం), ఇఫ్తార్ (ఉపవాస విరమణ) అరబ్ దేశాలలో ప్రత్యేక వంటకాలు కొన్ని ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ఖర్జూరంలో ఉపవాసం సమయంలో రోజంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి అవసరమైన అన్ని విటమిన్లు,  మినరల్స్ ఉంటాయని ప్రముఖ ఫుడ్ వ్లాగర్  ఫిర్దౌస్ నూరైన్ తెలిపారు. ఒమన్ తన ఆహార వారసత్వంలో చాలా భాగాన్ని నిలుపుకుందని, ప్రత్యేకంగా రమదాన్ సమయంలో ఒమానీ సంప్రదాయ వంటకాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఒమానీ రుచికరమైన వంటకాలలో మూలికలు, మెరినేడ్‌ల రకాలతో సుగంధ ద్రవ్యాల మిశ్రమ కలయికతో తయారు చేస్తారని తెలిపారు. 1960లలో ఒమన్‌లో ప్రత్యేకంగా రంజాన్ సమయంలో ఆహారాన్ని వండే సాంప్రదాయ పద్ధతులు పురుడుపోసుకున్నాయని పేర్కొన్నారు. 1960వ దశకంలో ఒమన్‌లోని పాత రోజులలో అత్యంత ఇష్టపడే ఆహారం చికెన్ లేదా లాంబ్ రైస్. తాజా కుంకుమపువ్వుతో వాటిని వండుతారు. జాతార్, అల్లం, జాజికాయ వంటి పదార్ధాలను  రుచికోసం వినియోగిస్తారు. చేపలను తాజాగా తరిగిన ఉల్లిపాయలు, ముల్లంగి, బచ్చలికూర కలిపి చేసే రెసిపీ కూడా ఒమానీ చరిత్రకు అద్దం పడుతుందన్నారు. దీనిని ఎక్కువగా ఇఫ్తార్ సమయంలో తయారు చేస్తారని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com