సౌదీ అరేబియాలో వర్షాలు, దుమ్ము తుఫానులు..!
- March 25, 2023
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో సోమవారం వరకు వాతావరణ హెచ్చుతగ్గులు నమోదు అవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ప్రకారం.. శనివారం నుండి నాలుగు రోజుల పాటు కింగ్‌డమ్‌లోని అనేక ప్రాంతాలలో ఉరుములు, ధూళి తుఫానులు వీస్తాయని సివిల్ డిఫెన్స్ పేర్కొంది. మక్కా, తైఫ్, అసిర్, అల్-బహా, జజాన్, నజ్రాన్, మదీనా, హేల్, తబుక్, అల్-జౌఫ్, అల్-ఖాసిమ్, అల్-షర్కియా, ఉత్తర సరిహద్దులతో సహా రియాద్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఎన్సీఎం పేర్కొంది. జెద్దా, రబీగ్తో సహా మక్కా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో చురుకైన గాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని, దీని వలన దుమ్ము తుఫాను వస్తుందని హెచ్చరించారు. మదీనా, తబుక్ ప్రాంతాలలో కొంత భాగంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తుందని, దానితో పాటు చురుకైన గాలులతో పాటు దుమ్ము రేగే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ తెలిపింది.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







