కెనడాలో ఘనంగా 'ఉగాది' వేడుకలు
- March 26, 2023
టొరంటో: మార్చి 25న కెనడాలోని టొరంటో నగరంలో శోభయమానంగా శ్రీ శోభకృత నామ ఉగాది వేడుకలు జరిగాయి.మొదట 11 గంటలకు పంచాంగ శ్రవణం,ఆహుతులందరూ పంచాంగ శ్రవణంలో తమ తమ రాశులకు సంబంధించిన విషయాలను శ్రద్ధగా విన్నారు.
తర్వాత 12:30 నుంచి 2:30 వరకు పెద్ద ఎత్తున ఉగాది విందు ఆహుతులందరూ అందరికీ వడ్డించారు.12:30 నుంచి 4:30 పిల్లలు,పెద్దలు తమ పాటల ద్వారా నృత్యాల ద్వారా వచ్చిన ఆహుతులను ఆనంద పరవశులు చేశారు.
ఆకర్షణమైన ఫోటో బూత్ ఏర్పాటు చేసి అందులో ఫోటో దిగిన ఫ్యామిలీలకు బహుమతులు ఏర్పాటు చేశారు.అలాగే ఆశ్చర్యకరమైన లక్కీ డ్రా లు, పిల్లల డ్రాయింగ్ ,బెస్ట్ వీడియో ఇలా మరెన్నో బహుమతులు నిర్వాహకులు అందజేశారు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే ,ఏర్పాటు చేసిన లైవ్ డీజె కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించింది.
బ్రిచ్మండ్స్ ఫ్రెండ్స్ క్లబ్ అనేది ఒక లాభా పేక్ష లేని స్వచ్ఛంద సేవా సంస్థ.అది కెనడాలోని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంచడానికి, అలాగే మన పండుగలను ఘనంగా జరుపుతూ ,ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు,పెద్దలు మన మూలాలు మర్చిపోకుండా కాపాడుతున్న గొప్ప సంస్థ. జగపతి రాయలు, సూర్య , అలాగే వందలకొద్ది వాలంటీర్ల శ్రమ ఈ సంస్థను దిగ్విజయంగా నడపడానికి ఉగాది లాంటి పండగలను మరింత గొప్పగా చేయడానికి తోడ్పడుతుంది.






తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







