రమదాన్ కొనుగోలు.. తప్పుడు ప్రచార ఆఫర్ల వలలో పడవద్దు
- March 26, 2023మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ సంస్థలు, ఔట్ లెట్లు అనేక ఆఫర్లు, ప్రమోషన్స్ ప్రకటిస్తాయి. వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తప్పుడు ప్రచార ఆఫర్ల వలలో పడవద్దని, వస్తువుల నాణ్యతను చెక్ చేసుకోవాలని వినియోగదారులను హెచ్చరించింది.వినియోగదారుల రక్షణకు సంబంధించిన చట్టాలకు సరఫరాదారులు కట్టుబడి ఉండేలా చూసేందుకు అల్ మవాలేహ్లోని పండ్లు, కూరగాయల కోసం సెంట్రల్ మార్కెట్ లో తనిఖీలు చేపట్టింది. వస్తువుల లభ్యత, రమదాన్ సమయంలో ధరల పెరుగుదలను నివారించడానికి ఈ తనిఖీలు ఉపయోగపడతాయని సిపిఏ తెలిపింది. ఏదైనా వాణిజ్య కార్యకలాపాల ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి న్యాయ నియంత్రణ అధికారులు, వాణిజ్య దుకాణాల ఇన్స్పెక్టర్లతో కూడిన ఫీల్డ్ విజిట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ