ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ..
- March 27, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. గవర్నర్‌ను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు సీఎం జగన్. దాదాపు గంట 15 నిమిషాల పాటు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. విశాఖలో మంగళవారం జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్‌కు తెలియజేశారు సీఎం జగన్. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజెంట్ రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో సీఎం జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.
మంగళవారం విశాఖలో జరిగే జీ-20 సమావేశానికి వెళుతున్నారు సీఎం జగన్.ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు సైతం ఈ సదస్సుకు హాజరవుతున్నారు. విశాఖలో జీ-20 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కారు అతిథుల కోసం ఇప్పటికే ఘనంగా విందు ఏర్పాటు చేస్తుంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







