ఒమన్‌లో వర్ష సూచన.. పాఠశాలలకు సెలవు
- March 28, 2023మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో మంగళవారం భారీ వర్షాల సూచనలు ఉన్న కారణంగా ఒమన్ సుల్తానేట్ ఉత్తర గవర్నరేట్లలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముసండం, నార్త్ అల్ బటినా, అల్ బురైమి, అల్ దహిరా గవర్నరేట్లలో మార్చి 28న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మార్చి 29న పాఠశాలలు పునఃప్రారంభించబడతాయని విద్యా మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ ఎర్లీ వార్నింగ్ ఆఫ్ మల్టిపుల్ హజార్డ్స్ (NCEWMH), మినిస్ట్రీలో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కోసం సెంట్రల్ కమిటీ జారీ చేసిన హెచ్చరిక నంబర్ (1)కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థుల భద్రతకు సంబంధిత అధికారులతో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తునట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..