ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!

- March 28, 2023 , by Maagulf
ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!

యూఏఈ:  స్టార్‌గేజర్‌లుగా అభివర్ణించే ఐదు గ్రహాల అమరిక.. మార్చి 28న రాత్రి యూఏఈ ఆకాశంలో కనువించు చేయనుంది. బుధుడు, బృహస్పతి, శుక్రుడు, యురేనస్, మార్స్ సూర్యాస్తమయం ఓకే వరుసలో ఆకాశంలో చంద్రుడితో పాటు ఆర్క్ రూపంలో కనిపిస్తుంది.  కానీ, పరిసర కాంతి పరిస్థితిపై ఆధారపడి ఈ గ్రహాల అమరికను ప్రభావవంతంగా చూడగలరని నిపుణులు చెప్పారు. అయితే, యూఏఈలో ఈ గ్రహాల అమరిక దృశ్యాన్ని ప్రజలు ఆస్వాదించవచ్చని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ సీఈఓ హసన్ అల్ హరిరి తెలిపారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇది జరుగుతుందని, గత సంవత్సరం ఇలాంటి అరుదైన గ్రహాల అమరిక ఉదయం జరిగిందని గుర్తుచేశారు. సాధారణంగా గ్రహాలు వేర్వేరు కక్ష్యలు.. కక్ష్య కాలాల్లో సూర్యుని చుట్టూ తిరుగుతాయని,  కొన్నిసార్లు అవి ఒక అమరికలో ఆకాశంలో కనిపిస్తాయని పేర్కొన్నారు. అయితే, బైనాక్యులర్‌లను ఉపయోగించడం వల్ల గ్రహాలను స్పష్టంగా చూడవచ్చని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com