రవితేజ 'రావణాసుర' ట్రైలర్ విడుదల
- March 28, 2023హైదరాబాద్: మాస్ రాజా రవితేజ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రావణాసుర ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై మరింత ఆసక్తి పెంచారు మేకర్స్.
సినీ లవర్స్ , అభిమానులు రవితేజ నుండి ఇంకోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘వాడు క్రిమినల్ లాయర్ కాదు .. లా చదివిన క్రిమినల్’ అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ కు రావణాసుర హ్యాట్రిక్ హిట్ కాబోతున్నట్లు ట్రైలర్ చెప్పకనే చెపుతుంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..