సిబ్బందికి ఉచితంగా కంటి వెలుగు పరీక్షలు ప్రారంభించిన రాచకొండ కమిషనర్ చౌహాన్
- March 29, 2023
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి మరియు కమీషనరేట్ ఆఫీసులో పనిచేస్తున్న మినిస్టీరియల్ సిబ్బందికి రాచకొండ పోలీసు భద్రత మరియు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం "కంటి వెలుగు" ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ డి.ఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు అధికారులు మరియు ఇతర సిబ్బంది యొక్క సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కూడా సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, కోవిడ్ సమయంలో కూడా సిబ్బందికి ఉచిత వ్యాక్సిన్ అందించడం జరిగిందని గుర్తు చేశారు.సిబ్బంది సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట మల్కాజిగిరి డీసీపీ జానకి, డీసీపీ అడ్మిన్ ఇందిర, డాక్టర్ అచ్యుత రావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!