ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఒమన్..!
- March 30, 2023
మస్కట్: 190 దేశాలతో కూడిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌లోని సభ్య దేశాలలో 2022 సంవత్సరంలో ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీస్ రంగంలో సుల్తానేట్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. Asyad గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న జాతీయ తపాలా సేవల ఆపరేటర్ అయిన ఒమన్ పోస్ట్.. గత కొన్ని సంవత్సరాలుగా సేవలను అప్‌గ్రేడ్ చేయడంలో విజయం సాధించింది. ఎక్స్‌ప్రెస్ మెయిల్ డెలివరీ సర్వీసులను 3-10 రోజుల్లో అందిస్తుంది. సుల్తానేట్ 2020లో 75వ స్థానంలో ఉండగా.. గత రెండేళ్లలో 74 ర్యాంక్‌లు మెరుగుపడి కొరియర్ సర్వీస్ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. డెలివరీ, రవాణా, డేటా ఖచ్చితత్వం, కస్టమ్స్ క్లియరెన్స్, పోస్టల్ సేవల వేగం-సామర్థ్యం వంటి 16 కీలక పనితీరు సూచికల ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025