9 ఏళ్లలో ఒకే తేదీన ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి..!

- March 30, 2023 , by Maagulf
9 ఏళ్లలో ఒకే తేదీన ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి..!

అబుధాబి: భారత దేశంలోని కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాకు చెందిన హలీమా ముస్తఫా, తైసీర్ అబ్దుల్ కరీమ్‌ దంపతులకు మార్చి 14 ప్రత్యేక రోజు. అబుధాబిలో నివసించే ఈ జంటకు  గత 9 సంవత్సరాలలో ఆ తేదిన ముగ్గురు పిల్లలు జన్మించారు. కుమార్తె తనీషా తహాని 2014లో జన్మించగా.. ఇద్దరు కుమారులు ముహమ్మద్ ఎమిన్ 2018లో.. హైజిన్ హమ్ద్ 2023 మార్చి 14న జన్మించాడు. ఇది నమ్మశక్యం కాని అనుభూతి అని, పవిత్ర రమదాన్ మాసం తమ కుటుంబానికి అదనపు ప్రత్యేకతను తెచ్చిందని ముగ్గురు పిల్లల తల్లి హలీమా గర్వంగా చెప్పారు. తాము ప్రసవానికి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు వేయలేదని లులూ గ్రూప్ ఇంటర్నేషనల్‌లో కేటగిరీ మేనేజర్‌గా పనిచేస్తున్న తైసీర్ అన్నారు. ప్రస్తుతం తనీషా, ఎమిన్ ఇద్దరూ సన్‌రైజ్ ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నారు. అబుధాబిలోని బుర్జీల్ హాస్పిటల్‌లోని స్పెషలిస్ట్ ప్రసూతి, గైనకాలజీ డాక్టర్ పాతుకుట్టి మహమ్మద్ మాట్లాడుతూ.. ఒకే రోజు ముగ్గురు పిల్లలు పుట్టడం చాలా అరుదని, తన కెరీర్‌లో ఇలాంటి కేసు గురించి వినలేదన్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఇదే మొదటిది కావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫిబ్రవరి 20న ఒకే రోజున జన్మించిన ఐదుగురు తోబుట్టువుల పేరిట ఉంది. ఈ రికార్డు 1966లో నమోదైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com