పిల్లలు తప్పిపోకుండా ఉచిత బ్రేస్ లెట్ల పంపిణీ

- March 30, 2023 , by Maagulf
పిల్లలు తప్పిపోకుండా ఉచిత బ్రేస్ లెట్ల పంపిణీ

మక్కా: మక్కాలోని గ్రాండ్ మస్జీదులో పిల్లలు తప్పిపోకుండా వారికి ఉచిత బ్రాస్లెట్లు పంపిణీ చేస్తున్నారు. హదియా, హజ్జీ, ముతామర్స్ గిఫ్ట్ ఛారిటబుల్ అసోసియేషన్ బ్రాస్‌లెట్‌ల పంపిణీని ప్రారంభించాయి. గ్రాండ్ మస్జీదులో తప్పిపోయిన పిల్లల కేసులను తగ్గించడం తమ లక్ష్యమని పంపిణీ సంస్థలు పేర్కొన్నాయి. బ్రాస్‌లెట్‌లపై పిల్లల పేరు, వారి తల్లిదండ్రుల సంప్రదింపు నంబర్‌ల వంటి అనేక వివరాలు ఉంటాయని తెలిపారు. బ్రాస్ లెట్లను పొందేందుకు కుటుంబాలు మక్కాలోని గ్రాండ్ మస్జీదు సమీపంలోని అసోసియేషన్ కార్యాలయాలను సందర్శించాలని సూచించారు. అసోసియేషన్ కార్యాలయాలలో ఒకటి మక్కాలో ఉండగా.. మక్కా కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో 4వ అంతస్తులో మరొకటి.. కింగ్ అబ్దుల్ అజీజ్ ఎండోమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంకోటి ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com