భార్య, పిల్లలను చంపింది ఇండియన్.. పోస్టుమార్టం రిపోర్టు ఔట్..!
- March 30, 2023
యూఏఈ: షార్జాలో భార్య, పిల్లలను చంపి అనంతరం అపార్ట్మెంట్లోని 10వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది 35 ఏళ్ల భారతీయుడని, వారి పోస్టుమార్టం నివేదికలోని కీలక వివరాలను షార్జా పోలీసులు వెల్లడించారు. సదరు వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలపై హింస లేదా ప్రతిఘటన గుర్తులను గుర్తించలేదని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఘటనపై తమకు నివేదిక అందిందని షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ తెలిపారు. అల్ మజాజ్ ప్రాంతంలోని ఒక టవర్ పదో అంతస్తు నుండి ఒక వ్యక్తి పడిపోయాడని సమచారం అందిందన్నారు. వెంటనే బుహైరా పోలీస్ స్టేషన్ నుండి పెట్రోలింగ్ సిబ్బంది, నేషనల్ అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, అయితే అతను అప్పటికే తీవ్ర గాయాలతో మృతి చెందాడని వెల్లడించారు. తన దగ్గర దొరికిన సూసైడ్ లెటర్ లో భార్య,పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందిన తర్వాత అపార్టుమెంట్ తలుపులు పగలగొట్టి చూడగా.. హతుడి భార్య, ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు కనిపించాయని పేర్కొన్నారు. విచారణ నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అందజేసిన తర్వాత మృతదేహాలను వారి స్వదేశానికి తరలించబడతాయని తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







