భారత రొయ్యల దిగుమతిపై సౌదీ తాత్కాలిక నిషేధం

- March 30, 2023 , by Maagulf
భారత రొయ్యల దిగుమతిపై సౌదీ తాత్కాలిక నిషేధం

రియాద్ : భారతదేశం నుండి రొయ్యల దిగుమతులపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) తాత్కాలిక నిషేధం విధించింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ఉత్పత్తులలో వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (WSSV) ఉనికిని గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. సరిహద్దుత ద్వారా దిగుమతి చేసుకున్న రొయ్యలతో సహా సముద్ర ఉత్పత్తుల నమూనాలను సేకరించాలని పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నమూనాల పరీక్షలో భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ఉత్పత్తులలో WSSV ఉన్నట్లు గుర్తించినట్ల వెల్లడించింది. అయితే, వైట్ స్పాట్ సిండ్రోమ్ అనేది పెనైడ్ రొయ్యల వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం. ఇది అంటువ్యాధి.. రొయ్యలను త్వరగా చనిపోయేలా చేస్తుంది. కాగా, ఇది మానవ ఆరోగ్యానికి లేదా ఆహార భద్రతకు ముప్పు కలిగించదని నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com