బాధితుల రక్షణకు ప్రత్యేక కార్యాలయం: LMRA
- March 31, 2023
బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) బాధితులు, వ్యక్తుల అక్రమ రవాణా కేసుల్లో సాక్షుల రక్షణ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు LMRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వ్యక్తుల అక్రమ రవాణా నిరోధ జాతీయ కమిటీ అధిపతి నౌఫ్ అబ్దుల్రహ్మాన్ జంషీర్ తెలిపారు. వ్యక్తుల అక్రమ రవాణా కేసులను అధ్యయనం చేసి అభ్యర్థనలను సమర్పించడం ద్వారా ఈ ప్రత్యేక కార్యాలయం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌తో సంప్రదింపుల పాయింట్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. కోర్టు తీర్పుల అమలును అనుసరించడంతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రక్రియల సమయంలో మానసిక, భౌతిక నష్టం నుండి బాధితులు, సాక్షులను రక్షించడం దీని లక్ష్యమన్నారు. బాధితులు, సాక్షుల రక్షణ కోసం LMRA కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, వ్యక్తుల అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై 2008 నాటి చట్టం నెం.1 నిబంధనల అమలుకు అనుగుణంగా.. ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు వ్యతిరేకంగా UN కన్వెన్షన్‌కు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్లు జంషీర్ చెప్పారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







