వెదర్ అప్డేట్: వర్షపాతం, ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
- April 01, 2023
యూఏఈ: కొన్ని ప్రాంతాలలో ధూళితో కూడిన గాలులు వీస్తాయని, పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా సముద్రం మీదనుంచి బలమైన గాలులు ముఖ్యంగా వీస్తాయని, దీనివల్ల దుమ్ము, ఇసుక గాలిలో కలిసి.. సమాంతర విజిబిలిటీ తగ్గుతుందని పేర్కొంది. దేశంలో ఉష్ణోగ్రతలు 36ºC వరకు ఉండవచ్చని, అబుధాబి, దుబాయ్‌లో ఉష్ణోగ్రతలు 31ºCకి పెరగవచ్చని తెలిపింది. అయితే, ఉష్ణోగ్రతలు అబుధాబిలో 20ºC , దుబాయ్‌లో 21ºC , ఇతర ప్రాంతాల్లో 11ºC కంటే తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం తేమగా ఉంటుంది. అబుధాబి, దుబాయ్‌లలో 25 నుండి 85 శాతం వరకు తేమ ఉంటుందని ప్రకటించారు. అరేబియా గల్ఫ్‌లో గాలులు చాలా చురుకుగా ఉంటాయని, ఒమన్ సముద్రంలో రాత్రి సమయంలో గాలులు మధ్యస్థంగా ఉంటాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్.. ముడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్‌కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు









