నానికి ‘దసరా’ అసలు సిసలు పండగే.!

- April 01, 2023 , by Maagulf
నానికి ‘దసరా’ అసలు సిసలు పండగే.!

నేచురల్ స్టార్ నాని ‘దసరా’తో గట్టిగా కొట్టాడు. అవును నిజమే.! ఈ సినిమా రిలీజ్‌కి ముందే నాని చాలా నమ్మకంగా కనిపించాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మాస్ ఆడియన్స్‌తో పాటూ, క్లాస్ ఆడియన్స్‌నీ ‘దసరా’ బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది.

మంచి ఓపెనింగ్స్ వచ్చాయ్ ‘దసరా’కి. యూఎస్‌లోనూ సినిమాకి పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. దాంతో, అక్కడా వసూళ్ల పండగే నానికి. సహజంగానే నానికి యూఎస్‌లో మంచి ఫాలోయింగ్ వుంది. ‘దసరా’కి పాజిటివ్ టాక్ రావడంతో, అక్కడ అనూహ్యంగా వసూళ్లు రాబడుతోంది.

జోరు చూస్తుంటే, ఈ సినిమాతో నాని 100 కోట్లు కొల్లగొట్టేలానే వున్నాడంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. కన్నడ నటుడు దినేష్ శెట్టి ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com