క్యాబ్‌ డ్రైవర్లకు పాఠాలు

- May 07, 2016 , by Maagulf
క్యాబ్‌ డ్రైవర్లకు పాఠాలు

దేశంలో క్యాబ్‌ డ్రైవర్లకు అవగాహన కార్య్కక్రమాలు నిర్వహించాలనే అభిప్రాయాలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. క్యాబ్‌ డ్రైవర్లు, ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చడంలో ఒక్కోసారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయా మార్గాల గురించి డ్రైవర్లకు అవగాహన లేకపోవడం ఓ సమస్య అయితే, ఇంకో సమస్య ప్రయాణీకులకు పూర్తిస్థాయిలో వారు చేరుకోవాల్సిన ప్రాంతంపై అవగాహన లేకపోవడం. జీపీఎస్‌ సౌలభ్యం ఉన్నప్పటికీ ప్రయాణీకులకి, డ్రైవర్లకీ మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌తో సమస్య తీవ్రత పెరుగుతోంది. ఈ సమస్యల్ని అధిగమించడానికి, ప్రయాణీకులతో డ్రైవర్‌ సరిగ్గా కమ్యూనికేట్‌ చేయడానికి క్యాబ్‌ డ్రైవర్లకు అవగాహన కల్పించడం, శిక్షణా కార్యక్రమాల్లో వారు పాల్గొనేటట్లు చేయడం ముఖ్యం అని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com