కిలిమంజారో పర్వత శిఖరాన్ని చేరుకున్న 13 ఏళ్ల ఎమిరాటీ బాలిక
- April 02, 2023
యూఏఈ: పదమూడు ఏళ్ల ఎమిరాటీ బాలిక అయా ఫకీహ్ కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోయించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో అయా కజిన్స్ పేరిట ఉంది. వారు ఈ ఘనతను 2018లో సాధించారు. మోవియా అల్షున్నార్ 15.5 సంవత్సరాల వయస్సులో పర్వతాన్ని అధిరోహించగా, అతని సోదరుడు అలీ 15 సంవత్సరాల ఒక నెలలో పర్వతాన్ని అధిరోహించారు. వారి చిన్న తోబుట్టువు సీఫ్ 14 ఏళ్ళ వయసులో శిఖరాన్ని జయించాడు. ‘‘భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించే రూమ్ టు రీడ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు నేను మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను." అని అయా ఫకీహ్ అన్నారు. 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన ఫ్రీ-స్టాండింగ్ పర్వతం. ఇది టాంజానియాలో ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!