ముగ్గురు బ్రిటన్ వ్యక్తులను బంధించిన తాలిబన్లు
- April 02, 2023
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో బ్రిటన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను తాలిబన్లు బంధించినట్లు శనివారం నాన్‌ప్రాఫిట్ గ్రూప్ ప్రెసీడియమ్ నెట్‌వర్క్ తెలిపింది. వారిలో ఇద్దరు గత జనవరి నుంచి బంధీలుగా ఉండగా, మరొకరు ఎంతకాలం నుంచి ఉన్నారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదని వెల్లడించింది. బందీలుగా ఉన్నవారిలో చారిటీ వైద్యుడైన 53 ఏండ్ల కెవిన్ కార్న్‌వెల్, యూట్యూబ్ స్టార్ మైల్స్ రౌట్‌లెడ్జ్ లతో పాటు మరొకరు హోటల్ మేనేజర్ అని, అతని పేరు తెలియదని పేర్కొంది. బంధీలుగా ఉన్న బ్రిటీష్ వ్యక్తులతో చర్చించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, వారి కుటుంబాలకు మద్దతు ప్రకటించామని యుకె విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బంధీలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రెసీడియమ్ నెట్‌వర్క్ తెలిపింది. అపార్ధం చేసుకోవడం వల్లే వారిని బంధీలుగా పట్టుకున్నారని, విడుదల చేయాలని తాలిబన్లను కోరారు. ముగ్గురి కుటుంబ సభ్యులతో తాము మాట్లాడుతున్నామని చెప్పారు. గతేడాది నలుగురు బ్రిటన్ జాతీయులతోపాటు వెటరన్ టీవీ కెమెరామెన్‌ను తాలిబన్లు ఆరు నెలలకుపైగా నిర్బంధించిన సంగతి తెలిసిందే.ఐఇఎ (ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్), బ్రిటన్‌ల మధ్య జరిగిన వరుస సమావేశాల అనంరతం ఆ ఐదుగురుని విడుదల చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. బ్రిటన్లు తమ దేశ చట్టాలు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







