పదో తరగతి విద్యార్థులకు శుభవార్త తెలిపిన APSRTC
- April 02, 2023
అమరావతి: APSRTC పదో తరగతి విద్యార్థులకు శుభవార్త తెలిపింది. పదో తరగతి ఫైనల్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులు తమ వద్దనున్న హాల్ టికెట్ చూపించి పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రయాణించొచ్చని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షలు జరిగినన్ని రోజులూ ఈ వెసులుబాటు ఉండనుంది.
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 3,348 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 6.64 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బస్సుల కోసం విద్యార్థులు ఇక్కట్లు పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బస్సు రవాణా లేని చోట విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే డీఈఓ ద్వారా ఆర్టీసీకి విఙప్తి చేస్తే ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పిస్తామని వివరించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







