100 ఫోన్లను దొంగిలించడానికి ప్రయత్నించిన నలుగురు అరెస్ట్

- April 02, 2023 , by Maagulf
100 ఫోన్లను దొంగిలించడానికి ప్రయత్నించిన నలుగురు అరెస్ట్

యూఏఈ: దుబాయ్‌లోని దీరాలో మొబైల్ ఫోన్ ట్రేడింగ్ కంపెనీ మేనేజర్, ఉద్యోగులపై దాడి చేసి 100 ఫోన్ల దొంగిలించేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు రికార్డుల ప్రకారం.. వాడిన 50 ఫోన్లు ఇవ్వాలని, వ్యాపారం చేస్తామని నిందితుల్లో ఒకరు తనకు ఫోన్ చేసి అడిగారని మొబైల్ ఫోన్ ట్రేడింగ్ కంపెనీ మేనేజర్ తెలిపారు. నిందితులు, మరో ముగ్గురితో కలిసి కంపెనీ ప్రధాన కార్యాలయానికి వచ్చారని, ఫోన్‌ల సంఖ్యను 100కి పెంచాలని మేనేజర్‌ని కోరారు. అందుకు మేనేజర్ అంగీకరించి, 100,000 దిర్హామ్‌ల విలువైన ఫోన్‌లను సిద్ధం చేసి పెట్టెలో పెట్టమని తన సిబ్బందిని ఆదేశించాడు. అయితే, నిందితులు ఫోన్లకు డబ్బులు ఇవ్వకుండా బాక్స్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా.. ఆ ముఠా కత్తులతో బెదిరించారు. కంపెనీ ఉద్యోగులు దొంగలను పట్టుకుని ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ముఠా ప్రధాన కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేశారు. అలాగే కంపెనీ మేనేజర్‌కు చెందిన చిన్న బ్యాగ్‌ను దొంగిలించారు. అందులో బ్యాంక్ కార్డులు, ఇతర కీలక పత్రాలు ఉన్నాయి. మేనేజర్ ఫిర్యాదుతో దుబాయ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సంగఘనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలను సేకరించింది. మేనేజర్ కార్డుతో చేసిన కొనుగోళ్లను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com