షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై 35% వరకు తగ్గింపు
- April 02, 2023
యూఏఈ: వాహనదారులకు షార్జా బంపరాఫర్ ఇచ్చింది. వాహనదారులు జరిమానాలను ముందుగానే క్లియర్ చేస్తే ట్రాఫిక్ జరిమానాలపై 35 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మంగళవారం జరిగిన షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. జరిమానా జారీ అయిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారు. ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుంది. కాగా, ఈ తగ్గింపు జరిమానా మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. జప్తు రుసుము, ఏదైనా ఇతర జరిమానా ఉంటే పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. ట్రాఫిక్ నేరం చేసిన సంవత్సరం తర్వాత చెల్లించినట్లయితే జరిమానాలు లేదా రుసుములపై ఎలాంటి రాయితీలు వర్తించవని షార్జా తెలిపింది.
తాజా వార్తలు
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!







