ప్రవాస కార్మికుల్లో 25% మంది గృహ సహాయకులే

- April 02, 2023 , by Maagulf
ప్రవాస కార్మికుల్లో 25% మంది గృహ సహాయకులే

కువైట్: సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో (CSB) జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2022 చివరి నాటికి కువైట్‌లోని మొత్తం కార్మిక శక్తిలో గృహ కార్మికులు దాదాపు 27 శాతం ఉన్నారు. 2021 చివరి నాటికి మొత్తం కార్మిక శక్తిలో మొత్తం గృహ కార్మికులు 24 శాతం మాత్రమే ఉన్నారు. 2022 చివరి నాటికి మొత్తం ప్రవాస గృహ కార్మికులు 753,000 కాగా... 2021 నాటికి 594,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ గృహ కార్మికులలో 347,000 మంది పురుషులు, 406,000 మంది మహిళలు ఉన్నారు. ఇక భారతీయ పురుష కార్మికులు 239,000 మంది(2021 లో 196,000)తో తొలిస్థానంలో ఉంది. ఇక ఆ తర్వాతి స్థానంలో ఫిలిపినో కార్మికులు 199,000 (2021 - 135,000 ) ఉన్నారు. మొత్తం గృహ కార్మికులలో భారతీయులు(పురుషులు,మహిళలు) 44.8 శాతంతో మొదటిస్థానంలో ఉండగా.. ఫిలిప్పీన్స్ 26.6 శాతంతో రెండవ స్థానంలో ఉంది. భారతదేశం, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక అనే నాలుగు జాతీయులు మొత్తం గృహ కార్మికులలో 94.9 శాతం వాటాను కలిగిఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com