దుబాయ్‌లో రెండు కొత్త వంతెనలు, టన్నెల్ ప్రారంభం

- April 03, 2023 , by Maagulf
దుబాయ్‌లో రెండు కొత్త వంతెనలు, టన్నెల్ ప్రారంభం

దుబాయ్: దుబాయ్‌లోని షిందాఘా కారిడార్‌లో మొత్తం 2.3కిమీల పొడవునా నిర్మించిన రెండు ప్రధాన వంతెనలు,  టన్నెల్ ను ప్రారంభించినట్లు రోడ్లు, రవాణా అథారిటీ (RTA)  ప్రకటించింది. అల్ ఖలీజ్ స్ట్రీట్, ఖలీద్ బిన్ అల్ వలీద్ రోడ్, అల్ ఘుబైబా రోడ్ మధ్య ఉన్న ఫాల్కన్ ఇంటర్‌చేంజ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగమైన ఈ రోడ్డు ప్రాజెక్ట్‌లు - గంటకు 27,200 వాహనాల సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపింది. "ఫాల్కన్ ఇంటర్‌చేంజ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ అనేది షేక్ రషీద్ రోడ్, అల్ మినా స్ట్రీట్, అల్ ఖలీజ్ స్ట్రీట్, కైరో స్ట్రీట్‌లో విస్తరించి ఉన్న 13 కి.మీ-పొడవు అల్ షిందాఘా కారిడార్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ విభాగం. ఫాల్కన్ ఇంటర్‌చేంజ్ మెరుగుదల అల్ షిందాఘా కారిడార్ (అల్ ఖలీజ్,  అల్ మినా స్ట్రీట్) వెంట సాఫీగా ట్రాఫిక్ ను అనుమతిస్తుంది. అంతేకాకుండా ఈ రెండు రోడ్ల సామర్థ్యం, ట్రాఫిక్ భద్రతను పెంచుతుంది. ఇది మినా రషీద్ (పోర్ట్ రషీద్)కి ప్రవేశ, ఎగ్జిట్ పాయింట్లను కూడా అందిస్తుంది. కొత్త వంతెన క్రింద అదనపు పార్కింగ్ స్థలాలను అందిస్తుంది, ”అని RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ మత్తర్ అల్ టేయర్ తెలిపారు.

అల్ ఖలీజ్ స్ట్రీట్‌లోని రెండు ప్రధాన వంతెనలు 1,825 మీటర్లు విస్తరించగా.. ఒక్కొక్కటి ఆరు లేన్‌లను కలిగి ఉన్నాయి. ఇవి రెండు దిశలలో గంటకు 12,000 వాహనాల మొత్తం సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మొదటి వంతెన 750 మీటర్లు, రెండవది దక్షిణ దిశలో 1,075 మీటర్లు విస్తరించి ఉంది. ఈ వంతెనలు డీరా వైపు నుండి కొత్త ఇన్ఫినిటీ బ్రిడ్జ్, అల్ షిందాఘా టన్నెల్‌తో పాటు షేక్ రషీద్ రోడ్‌లోని మెరుగైన జంక్షన్‌లకు అనుసంధానించారు. అలాగే ఖలీద్ బిన్ అల్ వలీద్ రోడ్ నుండి అల్ మినా స్ట్రీట్ వరకు రెండు లేన్ల సొరంగాన్ని ప్రారంభించారు. ఈ సొరంగం 500 మీటర్లు విస్తరించి, గంటకు 3,200 వాహనాలకు సదుపాయం కల్పిస్తుందని అల్ టేయర్ వివరించారు.

అల్ షిందాఘా కారిడార్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం RTA చే చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో ఒకటి. దీని మొత్తం అంచనా వ్యయం Dh5.3 బిలియన్లు. ఇది మొత్తం 13 కి.మీ విస్తీర్ణంలో 15 జంక్షన్ల నిర్మాణాన్ని కలిగి ఉంది. ఈ కారిడార్ దీరా దీవులు, దుబాయ్ సీఫ్రంట్, దుబాయ్ మారిటైమ్ సిటీ, మినా రషీద్ వంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు అదనంగా దీరా. బుర్ దుబాయ్‌లకు సేవలు అందిస్తుంది. ఇది 2030 నాటికి ప్రయాణ సమయాన్ని 104 నిమిషాల నుండి కేవలం 16కి తగ్గిస్తుందని(సుమారు 45 బిలియన్ దిర్హామ్‌లు ఆదా) అధికారులు అంచనా వేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com