ఉమ్రా యాత్రికులు నగదు, నగలు తేవద్దు: సౌదీ

- April 03, 2023 , by Maagulf
ఉమ్రా యాత్రికులు నగదు, నగలు తేవద్దు: సౌదీ

సౌదీ: ఉమ్రాకు వచ్చే యాత్రికులు పెద్ద మొత్తంలో నగదు, ఖరీదైన వస్తువులు, ఆభరణాలను తీసుకురావద్దని సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. యాత్రికులు ఆర్థిక మోసాలకు గురికాకుండా మంత్రిత్వ శాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులు గరిష్ఠంగా $16,000 (SAR 60,000) నగదును మాత్రమే వెంట తీసుకురావాలని అధికార యంత్రాంగం సూచించింది. కరెన్సీని బదిలీ చేయడానికి లేదా మార్పిడి చేయడానికి అధీకృత బ్యాంకులు, మనీ ఎక్స్ఛేంజ్ ప్రొవైడర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడానికి సౌదీ అరేబియాలో మూడు రకాలు మాస్టర్ కార్డ్, వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌లు ఆమోదయోగ్యమైనవని పేర్కొంది. తమ రక్షణ హక్కుల కోసం ఆర్థిక లావాదేవీలు జరిపిన సమయంలో యాత్రికులు అన్ని రసీదులు, ఎలక్ట్రానిక్ లావాదేవీల రుజువులను తమ వద్ద పెట్టుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com