ఖైదీల కుటుంబాల అద్దెలు, పిల్లల చదువుకు పోలీసుల ఆర్థిక సహాయం
- April 03, 2023
యూఏఈ: దుబాయ్‌లోని వందలాది మంది ఖైదీల టుంబాల అపార్ట్‌మెంట్ అద్దెలు, వారి పిల్లల చదువుల ఖర్చులు, వైద్య బిల్లులను దుబాయ్ పోలీసులకు చెల్లించారు. దుబాయ్ పోలీసు విభాగంలోని హ్యుమానిటేరియన్ కేర్ డిపార్ట్‌మెంట్ గత సంవత్సరం ఖైదీలకు 1 మిలియన్ దిర్హామ్‌లకు పైగా ఆర్థిక, అంతర్గత సహాయం అందించినట్లు హ్యుమానిటేరియన్ కేర్ డిపార్ట్‌మెంట్ హెడ్ కెప్టెన్ హబీబ్ అల్ జరౌనీ తెలిపారు. ఖైదీలకు, వారి కుటుంబాలకు సహాయం అందించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక భూమిక పోషిస్తున్నాయని వివరించారు. ఈ ఆర్థిక సహాయం జైళ్లలోని ఖైదీల జీవన స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు వారి కుటుంబాలకు సహాయం చేశాయని తెలిపారు. ఖైదీలను శిక్షించడం కాదని, వారికి పునరావాసం వైపు మార్గనిర్దేశం చేయడంతోపాటు వారు శిక్ష అనుభవించిన తర్వాత సమాజంలో జీవంచడానికి అవసరమైన నైపుణ్యాలు, శిక్షణతో వారిని సన్నద్ధం చేయడం తమ లక్ష్యమని డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మర్వాన్ అబ్దుల్ కరీమ్ జల్ఫర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







