వాసంతము

- April 03, 2023 , by Maagulf
వాసంతము

ప్రకృతిలో ఎన్నో అందాలు 

ఆకుపచ్చని పైరులు వీచే పిల్లగాలులు
గలగల పారే సెలయేళ్ళు 
చిరుచిరు సవ్వడుల పిల్లకాలువలు 
కూహుకుహు కోకిలమ్మ సరిగమలు 
లేలేత సువాానల మావిచిగుర్లు ...

పచ్చదనంతో కళకళలాడే పల్లెసీమలు
తియ్యనైన పలుకుపలికే రామచిలుకలు 
వీనులవిందైన సంగీతాల సందడులు 
దూసుకొస్తున్న గ్రీష్మ తాపాలు 
మత్తెక్కించే మల్లెల గుభాళింపులు 
పులకింతల విరిజల్లులు...

అలా వస్తావు ఇలా మురిపిస్తావు 
క్రొత్త క్రొత్త ఆశలు ఆశయాలు మోసుకొస్తావు 
నీ ఆగమనంతో అందరిని మైమరపిస్తావు
మదిలో మొదలాయే ఏవో అలజడులు 
నూతన వత్సరంతో చిగురించే నవవసంతం 
ప్రతి ఉదయం ఓ నూతన వసంతం...

గతచేదు సంఘటనలు వీడి వర్తమానము 
చవిచూస్తు భవిష్యత్తు వెలుగులు అందంగా 
నిండు మనసుతో స్వాగతిస్తు  తెలుగు లోగిళ్ళలో 
సందడులు నింపే ప్రతి వసంతం గమ్మత్తైన 
వాసంతం..

--- యామిని కోళ్ళూరు(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com