బాలయ్య సినిమాలో విలన్‌గా తెలుగమ్మాయ్.!
- April 04, 2023
బాలయ్య 108వ చిత్రం ప్రస్తుతం షూటింగ్లో వున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్నారు.
కాగా, ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం అంజలిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు కన్ఫామ్ అయినట్లేనట. నెగిటివ్ షేడ్స్‌తో కూడుకున్న పాత్రనీ తెలుస్తోంది.
ఈ మధ్య సినిమాల కన్నా, వెబ్ సిరీస్‌లతోనూ ఎక్కువ బిజీగా గడుపుతోంది అంజలి. వెబ్ కంటెంట్‌లో లీడ్ రోల్స్ అంజలిని వరిస్తున్నాయ్. అలా ఓటీటీ ప్రేక్షకులకు అంజలి బాగా దగ్గరైపోయింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఇప్పుడిప్పుడే సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ అంజలి కోసం వెతుక్కుంటూ వస్తున్నాయని తెలుస్తోంది.
అందులో భాగంగా విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమాలో అంజలి ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ పోషిస్తుండగా, బాలయ్య సినిమా అంజలిలోని డిఫరెంట్ నటిని బయటికి తీయనుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!







