మదీనాలో అత్యధిక నిరుద్యోగిత రేటు

- April 04, 2023 , by Maagulf
మదీనాలో అత్యధిక నిరుద్యోగిత రేటు

రియాద్ : సౌదీ అరేబియాలో అత్యధిక నిరుద్యోగిత రేటు మదీనా 12.2 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా రియాద్ లో 6.7 శాతం నమోదైంది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన గణాంక డేటా వెల్లడించింది. మదీనా తరువాత 11 శాతంతో జజాన్, 7 శాతంతో మక్కా, 6.9 శాతంతో తూర్పు ప్రావిన్స్ నిలిచాయి. గత త్రైమాసికంలో 9.9 శాతంతో పోలిస్తే 2022 నాల్గవ త్రైమాసికంలో సౌదీలలో నిరుద్యోగిత రేటు 8 శాతానికి చేరుకుందని అధికార యంత్రాంగం పేర్కొంది. 2022 మూడవ త్రైమాసికంతో పోల్చితే రాజ్యంలో మొత్తం జనాభాలో నిరుద్యోగిత రేటు కూడా తగ్గింది. ఈ కాలంలో 4.8 శాతానికి చేరుకుంది.

GASTAT డేటా ప్రకారం.. 2022 నాల్గవ త్రైమాసికంలో 15 - 24 సంవత్సరాల మధ్య వయస్సు గల సౌదీ యువకులలో నిరుద్యోగం రేటు 16.8 శాతానికి చేరుకుంది. 25 - 54 సంవత్సరాల మధ్య ఉన్న ప్రాథమిక పని వయస్సు గల సౌదీ పౌరులలో నిరుద్యోగం రేటు 7 శాతంగా ఉంది. బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన వారు 2022 నాల్గవ త్రైమాసికంలో అత్యధికంగా 9.9 శాతం నిరుద్యోగ రేటును కలిగి ఉండగా.. డిప్లొమా హోల్డర్లు 8.1 శాతంతో ఉన్నారు. హైస్కూల్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు 7.4 శాతంగా నమోదైంది. డాక్టరేట్ డిగ్రీ ఉన్నవారిలో నిరుద్యోగం అత్యల్పంగా 0.2 శాతంగా ఉంది. విద్యా నైపుణ్యాల ప్రకారం అత్యధికంగా 12.8 శాతంతో సహజ శాస్త్రాలు, గణితం సబ్జెక్టులలో నిరుద్యోగిత రేటు ఉండగా.. కళలు, మానవీయ శాస్త్రాలలో 11.6 శాతం, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతికత 10 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com