ఏప్రిల్ 8న ఫ్యాన్సీ ఫోన్ నంబర్లు, కార్ నంబర్ ప్లేట్లు వేలం

- April 04, 2023 , by Maagulf
ఏప్రిల్ 8న ఫ్యాన్సీ ఫోన్ నంబర్లు, కార్ నంబర్ ప్లేట్లు వేలం

యూఏఈ: యూఏఈ ‘1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్’ ప్రచారానికి మద్దతునిచ్చేందుకు ఫ్యాన్సీ వాహన నంబర్ ప్లేట్లు, మొబైల్ ఫోన్ నంబర్‌లను వేలం వేయనున్నారు. ఏప్రిల్ 8న (శనివారం) దుబాయ్‌లో జరిగే మోస్ట్ నోబుల్ నంబర్ ఛారిటీ వేలం కోసం.. 'డైమండ్+' నంబర్‌లను (971548888888, 971565555500, 971565555500, 9715500, 8851878859596 971547888888, 971542022222, 971564666664, 971545544444, 971566000006, 971562822222.) అందుబాటులో పెట్టారు.  దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) మద్దతుతో  అనేక ప్రత్యేక నంబర్‌లను వేలంలో కేటాయించనున్నారు. వీటిలో సింగిల్-డిజిట్ ప్లేట్ P7, 10 రెండు అంకెలు ఉన్నాయి. AA19, AA22, AA80, O71, X36, W78, H31, Z37, J57 , N41. ఇతర ప్రత్యేక ప్లేట్ నంబర్లలో Y900, Q22222, Y6666 ఉన్నాయి.

మరోవైపు అబుభాబి పోలీసులు ఏప్రిల్ 4 నుండి 10 వరకు జరిగే డిజిటల్ వేలం కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రత్యేక వాహన ప్లేట్ నంబర్‌లు, కళాకృతులను వేలం వేయడానికి దాతలను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా 1 బిలియన్ మీల్స్ డ్రైవ్‌కు మద్దతును అందజేయనుంది. మొత్తం 555 అబుధాబి వాహన లైసెన్స్ ప్లేట్లను వేలం వేయనున్నారు. వీటిలో వివిధ వర్గాలలో 19, 77, 100, 555 మరియు 999 ఉన్నాయి.

రమదాన్ 2021లో నిర్వహించిన ఇదే తరహా వేలంలో Dh50.45 మిలియన్లను సేకరించారు. అనుకున్న దానికంటే అధికంగా రావడంతో.. 220 మిలియన్ల భోజనాలను సరఫరా చేశారు. అలాగే 2022లో వేలం ద్వారా 53 మిలియన్ దిర్హామ్‌లను సేకరించారు. అదే సంవత్సరం అబుధాబి పోలీసులు Dh111 మిలియన్లు సేకరించినట్లు RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ మాట్టర్ అల్ టేయర్ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com