నకిలీ ఉమ్రా క్యాంపెయిన్: 8 మంది ప్రవాసులు అరెస్ట్

- April 04, 2023 , by Maagulf
నకిలీ ఉమ్రా క్యాంపెయిన్: 8 మంది ప్రవాసులు అరెస్ట్

రియాద్ : మోసం చేసే ఉద్దేశ్యంతో నకిలీ ఉమ్రా ప్రచారాలను ప్రోత్సహించినందుకు 8 మంది ప్రవాసులను రియాద్ రీజియన్ పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది ప్రవాసులు భారతీయ జాతీయత రెసిడెన్సీ (ఇఖామా) వ్యవస్థ, కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నకిలీ ఉమ్రా ప్రచారాన్ని నిర్వహించడానికి నిందితులు 4 కాపీయింగ్, ప్రింటింగ్ కార్యాలయాలను తమ ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. 8 మంది నిందితుల అరెస్టును రియాద్ పోలీసులు ధృవీకరించారు. వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com