3 ఏళ్ల తర్వాత 80 శాతానికి చేరుకున్న మక్కా హోటల్ ఆక్యుపెన్సీ

- April 04, 2023 , by Maagulf
3 ఏళ్ల తర్వాత 80 శాతానికి చేరుకున్న మక్కా హోటల్ ఆక్యుపెన్సీ

మక్కా : 2023 రమదాన్ సీజన్‌లో మక్కాలోని హోటల్, వసతి రంగం భారీ పెరుగుదలను సాధించింది. హోటల్ ఆక్యుపెన్సీ రేటు 80%కి చేరుకుంది. ఇది మూడేళ్లలో అత్యధికం కావడం గమనార్హం. ఈ మేరకు మక్కా చాంబర్‌లోని హజ్,  ఉమ్రా కమిటీ విడుదల చేసిన డేటా తెలిపింది. ముఖ్యంగా రమదాన్ మొదటి 10 రోజులలో అధిక డిమాండ్ కారణంగా హోటళ్ల ధరలు పెరిగాయి. మక్కాలోని సెంట్రల్ ఏరియాలో హోటల్ రూమ్ బుకింగ్‌కు సంబంధించి అల్-ఎక్తిసాదియా బిజినెస్ డైలీ నిర్వహించిన సర్వేలో ధరలు రోజుకు SR3,000 - SR9,000 మధ్య ఉన్నాయి.

మక్కా చాంబర్‌లోని హజ్, ఉమ్రా కమిటీ చైర్మన్ అబ్దుల్లా అల్-ఖాదీ మాట్లాడుతూ.. మక్కాలోని హోటల్ గదుల ధర నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటుందని, గ్రాండ్ మస్జీదుకు సమీపంలో ఉండటంతో డిమాండ్‌, అందించిన సేవలను బట్టి ధరల శ్రేణి ఉంటుందని తెలిపారు.  ముఖ్యంగా సెంట్రల్ ఏరియాలో ఉన్న హోటల్‌లు, రమదాన్ సీజన్ సమీపిస్తున్నప్పుడు ధరలు క్రమంగా పెరుగుతాయని, చివరి 10 రోజుల్లో రెండింతలు పెరుగుతాయని ఆయన తెలిపారు.   మక్కాలోని సెంట్రల్ ఏరియాలో గది ధర SR35,000-SR55,000 మధ్య ఉందని, కానీ రమదాన్ చివరి 10 రోజులలో ఆ ధరలు SR45,000-SR90,000 చేరే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత రమదాన్ సీజన్‌లో విపరీతమైన రద్దీ కనిపిస్తుందని, దీంతో మక్కా సెంట్రల్ ప్రాంతంలో గదులకు అధిక డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com