‘రావణాసుర’.! రవితేజ జోరు తగ్గించేశాడే.!

- April 04, 2023 , by Maagulf
‘రావణాసుర’.! రవితేజ జోరు తగ్గించేశాడే.!

‘ధమాకా’, వాల్తేర్ వీరయ్య’ సినిమాలతో డబుల్ హిట్ కొట్టి రవితేజ ఈ మధ్య ఫుల్ జోష్ మీదున్నాడు. మరో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ 7న ‘రావణాసుర’ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.

అయితే, ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్నా సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ కావడం లేదు. అందుకు కారణం ప్రమోషన్లు చాలా వీక్‌గా వుండడమే. 

జస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసి ఊరుకున్నారంతే. రవితేజ ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, చిత్ర యూనిట్ సందడి కానీ కనిపించడం లేదు. మాస్ రాజా ఎందుకిలా చేస్తున్నాడు.? అంటూ ఫ్యాన్స్ విస్తుపోతున్నారు.

సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావణాసుర’ ప్రచార చిత్రాలు చూస్తుంటే, ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడనీ తెలుస్తోంది.

అయితే, ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోలా.? లేదంటే, డబుల్ రోల్ ఏమైనా వుందా.? అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఫరియా అబ్ధుల్లా, అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com