అబుధాబి పోలీసుల చర్యకు నివాసితుల మద్దతు
- April 05, 2023
అబుధాబి: కీలకమైన వేగవంతమైన రహదారి లేన్లలో కనీస వేగాన్ని అమలు చేయడానికి అబుధాబి పోలీసుల చర్యకు అధిక సంఖ్యలో నివాసితులు మద్దతు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫోర్స్ నిర్వహించిన పోల్ ప్రకారం.. 78 శాతం మంది ఈ చర్యకు అనుకూలంగా ఓటు వేశారని పోలీసులు తెలిపారు. ట్విట్టర్‌లో 81 శాతం మంది వినియోగదారులు ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్డులో 140కిలోమీటర్లు, రెండు ఎడమవైపు లేన్‌లపై కనిష్ఠంగా 120కిమీ వేగాన్ని అమలు చేస్తామని పోలీసులు గత నెలలో ప్రకటించారు. మే 1 నుండి రెండు లేన్‌లలో స్పీడ్ పరిమితి నిబంధన ఉల్లంఘించిన వారికి 400 దిర్హామ్‌ల జరిమానా విధించడం ప్రారంభించారు. రోడ్డు భద్రతను పెంపొందించడమే కనీస వేగ పరిమితి లక్ష్యంగా పోలీసులు ఈ సందర్భంగా వివరించారు. రహదారి గరిష్ఠ వేగ పరిమితి 140kmph కలిగి ఉన్నందున, ఫాస్ట్ లేన్‌లలో కనిష్ఠంగా 120kmph వేగాన్ని అమలు చేయడం వలన ఈ ట్రాక్‌లపై ఉన్న అన్ని వాహనాలు 20kmph మార్జిన్‌లో నడుస్తాయని తెలిపారు. ప్రమాదాలు జరిగితే వాటి తీవ్రతను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







