సౌదీలో 32 సంవత్సరాలలో రెండవ అత్యధిక వర్షపాతం నమోదు
- April 05, 2023
రియాద్: సౌదీ అరేబియా తన చరిత్రలో 32 సంవత్సరాలలో రెండవ అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసింది. గత జనవరిలో 1991-2020 కాలంతో పోలిస్తే సాధారణ రేటు కంటే ఎక్కువ వర్షాలు కురిసాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) ప్రకటించింది. రాజ్యంలో చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తన నివేదికలో పేర్కొంది.
1991-2020 కాలంతో పోలిస్తే, గత జనవరిలో అల్-ఖాసిమ్ స్టేషన్లో వర్షపాతం పరిమాణం 122.7 మిమీ నమోదైందని, ఇది చరిత్రలో అత్యధికమని తెలిపింది. ఉష్ణోగ్రతలకు సంబంధించి, జనవరిలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 2.3 °C పెరుగుదలను నమోదు చేసిందని NCM పేర్కొంది. ఇది 1991-2020 కాలంతో పోలిస్తే రెండవ అత్యధిక సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత అని వెల్లడించింది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత విషయానికొస్తే, ఇది 0.2 ° C మాత్రమే స్వల్పంగా పెరిగిందని తెలిపింది. 1991-2020తో పోలిస్తే జనవరిలో సగటు ఉష్ణోగ్రత 1.1 ° C పెరిగిందని NCM పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







