ఈద్ అల్ ఫితర్ సెలవులు: 100 శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!

- April 05, 2023 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ సెలవులు: 100 శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!

యూఏఈ: ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా నాలుగు /ఐదు రోజుల సెలవుల లాంగ్ వీకెండ్ రానుంది. దీంతో విమాన ప్రయాణాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే బుకింగ్‌లు ఊపకందుకున్నాయి. చాలా మంది అగ్రిగేటర్లు ప్యాకేజీలకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ హాలిడే ఫ్యాక్టరీ ప్రకారం.. జార్జియా,  అజర్‌బైజాన్ వంటి బడ్జెట్ గమ్యస్థానాలకు చాలా డిమాండ్ ఉందని, వాటికి సంబంధించిన ప్యాకేజీలు త్వరగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. "ఈ సంవత్సరం ఈద్ అల్ ఫితర్ ట్రావెల్ సీజన్ చాలా పెద్దది. ఈద్ అల్ ఫితర్‌లో విశ్రాంతి కోసం ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్యలో ఇప్పటికే 25 శాతం వృద్ధిని మేము చూస్తున్నాము" అని హాలిడే ఫ్యాక్టరీ మార్కెటింగ్ డైరెక్టర్ నమ్రతా భాటియా అన్నారు. “ముఖ్యంగా రాబోయే లాంగ్ వీకెండ్ కోసం చిన్న, సరసమైన హాలిడే ప్యాకేజీలకు అధిక డిమాండ్ ఉంది. మునుపటి ట్రెండ్‌లకు విరుద్ధంగా, చాలా మంది కస్టమర్‌లు తమ ఈద్ సెలవులను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా జార్జియా, అర్మేనియా, అజర్‌బైజాన్ వంటి అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు." అని భాటియా చెప్పారు. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం ఈద్ అల్ ఫితర్ సెలవుదినం ఏప్రిల్ 20( గురువారం) ప్రారంభమై..  ఏప్రిల్ 23 (ఆదివారం) వరకు కొనసాగే అవకాశం ఉంది.  

విమాన ఛార్జీలు పెరుగుతాయి..
ఫ్లైదుబాయ్ వెబ్‌సైట్ ప్రకారం.. ఎయిర్‌లైన్ టిక్కెట్ ఛార్జీలలో స్వల్ప పెరుగుదల ఉంది. అయితే, ఏప్రిల్ 23, 2023 వరకు ప్రయాణించడానికి ఏప్రిల్ 20 లోపు టిక్కెట్‌లను బుక్ చేసుకునే వారికి ఎయిర్‌లైన్ ఆఫర్ ప్రకటించింది.  ఉదహరణకు.. ఏప్రిల్ 19న అల్బేనియాలోని టిరానాకు టిక్కెట్‌లను రిజర్వ్ చేయాలని ప్లాన్ చేస్తే.. విమాన ఛార్జీ Dh1,420 అవుతుంది. అదే బాకుకి Dh1,248 ఖర్చవుతుంది. ప్రస్తుత ధర కంటే ఈ ధరలు 100 శాతం ఎక్కువ. అదే విధంగా ఏప్రిల్ 19 నుండి 4 రోజుల సెలవుల కోసం మాల్దీవులకు రౌండ్-ట్రిప్ విమాన ఛార్జీలు Dh3,418 నుండి మొదలవుతాయి. అనేక ట్రావెల్ వెబ్‌సైట్‌లలో ఒక్కొక్కరికి Dh4,500 చొప్పున ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com