అనేక ఆకర్షణలతో కొత్త Dh1,000 నోటు విడుదల

- April 07, 2023 , by Maagulf
అనేక ఆకర్షణలతో కొత్త Dh1,000 నోటు విడుదల

యూఏఈ: మార్కెట్‌లో చెలామణి కోసం పాలిమర్‌తో తయారు చేయబడిన Dh1,000 డినామినేషన్ కొత్త నోటును యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) విడుదల చేసింది. కొత్త నోటు ఏప్రిల్ 10 నుండి బ్యాంకులు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కొత్త నోటు రూపకల్పనలో CBUAE యూఏఈ విజయగాథను హైలైట్ చేశారు. ప్రపంచ విజయాలను ప్రతిబింబించే సాంస్కృతిక, అభివృద్ధి చిహ్నాలతో పాటు ఇతర చిత్రాలను ఉపయోగించారు. కొత్త నోటు రూపకల్పనలో అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా ఉన్న యూఏఈ వాస్తవిక ఆశయాలను పొందుపరిచారు. యూఏఈ బ్రాండ్ ఫ్లోరోసెంట్ బ్లూ గుర్తులతో పాటు అధునాతన ఇంటాగ్లియో ప్రింటింగ్ పద్ధతులను ఉపయోగించి రూపొందించిన డ్రాయింగ్‌లతో కొత్త నోటును రూపొందించారు. కొత్త నోటు ముందు వైపు దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్, 1974లో నాసా పయినీర్‌లతో జరిగిన సమావేశం నుండి ప్రేరణ పొందిన స్పేస్ షటిల్ మోడల్ చిత్రం ఉంది. కొత్త నోటు వెనుక భాగంలో అబుధాబిలోని బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ చిత్రం ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com