దుబాయ్ రాయల్ వెడ్డింగ్: ఒక్కటికానున్న షేక్ మహ్రా, షేక్ మన..!

- April 07, 2023 , by Maagulf
దుబాయ్ రాయల్ వెడ్డింగ్: ఒక్కటికానున్న షేక్ మహ్రా, షేక్ మన..!

దుబాయ్:  తన కుమార్తె షేఖా మహ్రా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వివాహం షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌తో జరుపనున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధికారికంగా ప్రకటించారు. వరుడి తండ్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ నూతన వధూవరుల కోసం రాసిన అందమైన కవితను షేఖా మహ్రా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇదే కవితను షేక్ మనా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇద్దరు రాజకుటుంబాల మధ్య వివాహం ఖరారైన నేపథ్యంలో ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షేఖా మహరా యూకే నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో  డిగ్రీ కూడా చేసారు. షేక్ మనా ఒక వ్యాపారవేత్త . అతను దుబాయ్‌లో రియల్ ఎస్టేట్,  టెక్నాలజీలో అనేక విజయవంతమైన వెంచర్‌లలో భాగస్వామిగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com