అమ్మ నేర్పేన అక్షరం

- April 12, 2023 , by Maagulf
అమ్మ నేర్పేన అక్షరం

అమ్మ నేర్పేన అక్షరం నాన్న నేర్పిన ధర్మం

గురువు చూపిన మార్గం మరువకెన్నడు మానవ సర్వం జగన్నాథమయమే జీవితం 

గతమెన్నడు కాదు సత్యమని ఎంచకయ్య గాడి తప్పును జీవితం వీడకయ్య ధర్మం  
భవిష్యత్తు నాదని కనవయ్య కలలెన్నో విడనాడక సత్యం కలుగు నీకు జ్ఞానం 

పరమాత్మ తత్త్వమె నిన్ను పాలించు 
పరంధాముని ధ్యానించు పలుకును నిత్యం
పరమాత్మే సర్వమని పర బ్రహ్మ స్వరూపమే
నేనని నడవు ముందుకు ప్రతి క్షణం 

సర్వశక్తి సంపన్నుడొక్కడే సృష్టి లయ ప్రళయం కారకుడు అతడే అదే ఆత్మరూపం
మనస్సు నియంత్రణతో సత్కార్యములు
జేయుము అహంకార నివృత్తి బడయుము

సత్కర్మలతో మదమాత్సర్యములు తొలుగు
ను సద్గుణములబ్బును సత్శీలుడౌదువు
శీలము కాలము పోయిన సంపాదించలేము
ఐశ్వర్యం కొరకు నిందలు మోయకు

నిత్యమైన సత్యాన్ని ఆలకింపుము 
మంచి మనసుతో కలుగు నీకు భాగ్యము
సత్యమైన వచనాన్ని ఆచరింపు 
మంచి మనసుతో కలుగు నీకు మోక్షము

--జి.రామమోహన నాయుడు (మాజీ సైనికుడు)
మదనపల్లె రచయితల సంఘం,ఆంధ్ర ప్రదేశ్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com