డబుల్ పార్కింగ్, వాహనాలను అడ్డుకుంటే.. Dh500 జరిమానా
- April 14, 2023
యూఏఈ: ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వాహనాల వెనుక పార్కింగ్ చేయవద్దని షార్జా పోలీసులు వాహనదారులకు పిలుపునిచ్చారు. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పలు సూచనలు జారీ చేసింది. వాహన కదలికలను అడ్డుకోవడం ట్రాఫిక్ జామ్ కి దారితీస్తుందని, ఇది వాహనదారుల సమయాన్ని వృథా చేయవచ్చని అథారిటీ నివాసితులకు గుర్తు చేసింది. యూఏఈలో చట్టవిరుద్ధమైన పార్కింగ్ వాహనాలు, పాదచారుల కదలికలను అడ్డుకోవడమే కాకుండా, అగ్నిమాపక వాహనాల రాకపోకలపై ఇది ప్రభావం చూపుతుందని, ఇలాంటి చర్యలు అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించింది. ఇటీవల అబుధాబి పోలీసులు తరావీహ్ లేదా ఇతర ప్రార్థనల సమయంలో పలు పార్కింగ్ సూచనలు జారీ చేసింది. పవిత్ర మాసంలో వాహన డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలని,పార్కింగ్ చట్టాలను పాటించాలని, ముఖ్యంగా ప్రార్థన సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆర్టికల్ 62లోని ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో విఫలమైతే Dh500 జరిమానా విధించబడుతుందని తెలిపింది. గత వారం ఎమిరేట్స్ మునిసిపాలిటీ కూడా కాలిబాటలలో పార్కింగ్ చేయడం, ట్రాఫిక్ ప్రవాహానికి అంతరాయం కలిగించడం, ఇతర రహదారి వినియోగదారులకు అసౌకర్యం కలిగించడం లాంటివి చేస్తే 1,000 దిర్హామ్ వరకు జరిమానా విధించనున్నట్లు అలెర్ట్ జారీ చేసింది. అబుధాబిలోని బస్ స్టాప్‌లో పార్కింగ్ చేయటం నిషేధం. ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ITC) ప్రకారం, వాహనదారులు ప్రయాణికులను ఎక్కించుకోవడానికి, దింపడానికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. నిబంధనను ఉల్లంఘిస్తే 2,000 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









