ఈద్ అల్-ఫితర్: పాఠశాలలకు 12రోజులపాటు సెలవులు
- April 14, 2023
జెడ్డా : సౌదీ అరేబియాలోని పాఠశాలలకు రమదాన్ (ఈద్ అల్-ఫితర్)సెలవులు ప్రకటించారు. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 26 వరకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది. బాలురు, బాలికల సాధారణ విద్యా పాఠశాలలతోపాటు అడ్మినిస్ట్రేటివ్, ఎడ్యుకేషనల్ కేడర్లకు సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడవ, చివరి సెమిస్టర్‌ను పూర్తి చేయడానికి విద్యార్థులు ఏప్రిల్ 26న (12 రోజుల తర్వాత) పాఠశాలకు తిరిగి వస్తారు. మే 28-29 న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో చివరి లాంగ్ వీకెండ్ కానుంది. ఆగస్టు 2022లో ప్రారంభమై 185 పాఠశాల రోజుల పాటు కొనసాగిన 1444 AH విద్యా సంవత్సరం జూన్ 22 (గురువారం) తో ముగుస్తుంది. మరోవైపు, మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) ప్రైవేట్ రంగానికి.. లాభాపేక్షలేని రంగానికి ఈద్ అల్-ఫితర్ సెలవుదినాలు ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీ వరకు (4 రోజు) గా సెలవులను ప్రకటించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









