4 కొత్త స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్ ప్రారంభించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- April 14, 2023
రియాద్: సౌదీ అరేబియాలో నాలుగు కొత్త ప్రత్యేక ఆర్థిక మండలాలను (స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్)ఆర్థిక, అభివృద్ధి వ్యవహారాల కౌన్సిల్ చైర్మన్, క్రౌన్ ప్రిన్స్ , ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ గురువారం ప్రారంభించారు. రియాద్, జజాన్, రాస్ అల్-ఖైర్ మరియు జెద్దాకు ఉత్తరాన ఉన్న కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీలో ఉన్న కొత్త ఆర్థిక మండలాలను ప్రకటించారు. ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా సౌదీ అరేబియా ప్రధాన స్థానాన్ని కొత్త ఆర్థిక మండలాలు మరింత బలోపేతం చేస్తాయని క్రౌన్ ప్రిన్స్ ఈ సందర్భంగా వెల్లడించారు. కొత్త SEZలలో పనిచేసే కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేట్లు, దిగుమతులు, ఉత్పత్తి ఇన్‌పుట్‌లు, యంత్రాలు, ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాల నుండి మినహాయింపు వంటి ప్రయోజనాలతోపాటు కంపెనీలలో 100 శాతం విదేశీ యాజమాన్యం, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ గల ఉద్యోగులను ఆకర్షించడానికి, నియమించుకోవడానికి సౌలభ్యం ఉంటుందని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







