కాళ్ల తిమ్మిరిని లైట్ తీసుకోవద్దు సుమా.!
- April 18, 2023
ఎక్కువ సేపూ ఒకే డైరెక్షన్లో అదీ, కాళ్లపై ఒత్తిడి పడేలా కూర్చుంటే కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం సహజమే. ఆ భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల అలా జరుగుతుంటుంది. ఆ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సరి అయితే తిమ్మిరి తగ్గిపోతుంది.
అయితే, తరచూ అలా జరుగుతుంటే, అనారోగ్య సమస్య వున్నట్లు గుర్తించాలి. వైద్యుని సంప్రదించాలి. విటమిన్ బి 12 లోపం వున్న వారిలోనూ ఇలా జరుగుతుంది. మాంసకృత్తులు ఎక్కువగా వున్న పోషకాహారం తీసుకోవడం వల్ల విటమిన్ బి 12 సమస్యను నివారించుకోవచ్చు.
తరచూ కాళ్లు తిమ్మిరెక్కడం, కాళ్లలో ఏదో పాకుతున్నట్లు అనిపించడం డయాబెటిస్ లక్షణం కూడా కావచ్చు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని వద్ద సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
కిడ్నీ సమస్యలున్న వాళ్లలోనూ ఇలా అనిపించడం సహజం. కిడ్నీ వ్యాధి గ్రస్తుల్లో మజిల్స్ డ్యామేజ్ ఎక్కువగా వుంటుంది. తద్వారా కాళ్లు, చేతులు తిమ్మిరెక్కుతూ పట్టు కోల్పోతుంటాయ్. ఆలస్యం చేయకుండా ఈ సమస్య వుంటే, వైద్యుని సంప్రదించాలి.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







