మాస్ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్.!

- April 19, 2023 , by Maagulf
మాస్ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్.!

మాస్ మసాలా డైరెక్టర్‌గా సంపత్ నందికి మంచి పేరుంది. ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన, రెండో సినిమాకే చరణ్ వంటి స్టార్ హీరోతో ‘రచ్చ’ సినిమా తీసి రచ్చ రచ్చ చేశాడు. 

ఆ తర్వాత నుంచీ సంపత్ నందికి పెద్దగా కలిసి రావడం లేదు. ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అంటూ గోపీచంద్‌తో ఓ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.

తాజాగా సంపత్ నంది ఓ మెగా హీరో కోసం అదిరిపోయే కథ రాసుకున్నాడట. ఆ మెగా హీరో మరెవరో కాదు, సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘విరూపాక్ష’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న తేజు, సంపత్ నంది కథకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది.

చూడాలి మరి తేజును తన సినిమాలో ఎలా చూపించబోతున్నాడో సంపత్ నంది. తనకు బాగా కలిసొచ్చిన మెగా కాంపౌండ్ హీరోతో ఎలాగైనా హిట్టు కొట్టి, మళ్లీ తన సత్తా చాటాలనుకుంటున్నాడట సంపత్ నంది. 

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com